News December 19, 2025

బురుజుపేట: అమ్మవారిని దర్శించుకున్న 10 లక్షల మంది

image

మార్గశిరమాసం కనకమహాలక్ష్మి అమ్మవారి నెలరోజులు దర్శనాలు విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిశాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారన్నారు. 10 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. మహా అన్నదానంలో 20వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేశామని చెప్పారు. పోలీసులు సహకరించారని చెప్పారు.

Similar News

News December 19, 2025

కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ముగింపు

image

బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. శుక్రవారం అమ్మవారు మాల ధరించిన భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ ముగ్గులు పలువురుని ఆకట్టుకున్నాయి. ఆలయంలో దీపాలంకరణ సేవను ఈవో శోభారాణి దీపాలు వెలిగించి ప్రారంభించారు.అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఈవో శోభారాణి తెలిపారు.

News December 19, 2025

విశాఖ సీపీకి ప్రతిష్టాత్మక అవార్డు

image

ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్ కేసు చేధించిన విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి ఇవాళ రాష్ట్ర డీజీపీ నుంచి ప్రతిష్టాత్మక ABCD (Award for Best Crime Detection) అవార్డును అందుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో 19 మందిని అరెస్ట్ చేసి, నిందితుల వద్దనున్న ₹55.79 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని సీజ్ చేశారు. నగదును బాధితులకు తిరిగి అందించడంతో అవార్డు అందుకున్నారు.

News December 19, 2025

అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్‌లో ఉద్యోగి ల్యాండ్

image

నేవీ ఉద్యోగి పారాచూట్‌పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.