News February 22, 2026
బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Similar News
News March 2, 2026
వార్ ఎఫెక్ట్: 22% పెరిగిన గ్యాస్ ధరలు!

వెస్ట్ ఏషియా యుద్ధంతో యూరప్‌లో గంటల వ్యవధిలోనే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఏకంగా 22% ఎగిసినట్టు వార్తలు వస్తున్నాయి. సౌదీలోని అరామ్ కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నష్టం విలువ $2 ట్రిలియన్ల పైనే ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా నుంచి గ్యాస్, చమురు దిగుమతులను ఆపేసిన యురోపియన్లకు ఇది పెద్ద దెబ్బే. వారి స్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నది విశ్లేషకుల మాట.
News March 2, 2026
దలాల్ స్ట్రీట్‌లో ‘దడ’

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లను కుదిపేస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 1700, నిఫ్టీ 560 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, పోర్ట్స్, ఎయిర్‌వేస్, ఆటో, చమురు రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.10లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇక గోల్డ్, సిల్వర్ ETFs మాత్రం రయ్యిన దూసుకెళ్తున్నాయి. బిగ్ మనీ మొత్తం విలువైన మెటల్స్ వైపే పరుగులు తీస్తోంది. అనిశ్చితి మరింత పెరిగేలా కనిపిస్తోంది.
News March 2, 2026
GAILలో 70 పోస్టులు.. అప్లై చేశారా?

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com


