News December 1, 2025

బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 26,325, సెన్సెక్స్ 86,159 పాయింట్లతో ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60K మార్క్ క్రాస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 26,285 వద్ద, సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 86,020 వద్ద కొనసాగుతున్నాయి. బెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ITC నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Similar News

News December 5, 2025

నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

image

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ & అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

News December 5, 2025

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

image

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.

News December 5, 2025

‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

image

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.