News October 10, 2025
బూర్జ: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడుపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం.ప్రవల్లిక వివరాలు మేరకు.. బూర్జ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లికి నిరకరించడంతో సదరు బాలిక ఫిర్యాదు మేరకు గురువారం ఆ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 10, 2025
SKLM: ప్రయాణికులకు శుభవార్త

పంచరామ క్షేత్రాలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పలనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట వెళ్లేందుకు రూ 2,400, 2,350లతో apsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
News October 10, 2025
వజ్రపుకొత్తూరు: అలల తాకిడికి మరో మత్స్యకారుడు బలి

సముద్రపు అలల తాకిడికి మరో మత్స్యకారుడు బలిపోయాడు. వజ్రపుకొత్తూరు మండలం దేవునళ్తాడ గ్రామానికి చెందిన బీ.చినబాబు(42) గురువారం సముద్రంలో వేటకు వెళ్లాడు. అయితే అలల తాకిడికి తెప్ప నుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోవడంతో మృతిచెందాడు. కాగా మృతునికి నాలుగు నెలల క్రితమే వివాహం అయ్యింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 10, 2025
SKLM: జీలుగ ఉత్పత్తులను సీఎంకు చూపించిన మంత్రి

రాష్ట్ర రాజధానిలో గురువారం సీఎం చంద్రబాబుకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జీలుగ ఉత్పత్తులను చూపించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని CM రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్న కోరారు. ధరలు సూచించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు