News April 13, 2025
బూర్జ: రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన విద్యార్థిని

బూర్జ మండలం ఓవిపేట మోడల్ స్కూల్‌లోఎంపీసీ గ్రూపు సెకండ్ ఇయర్ చదువుతున్న కె.ధరణి శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. 1000కి 984 మార్కులు రావడంతో ఇంటర్మీడియట్ కార్యదర్శి విద్యార్థినిని సైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును 15న సీఎం చేతులు మీదుగా విజయవాడలో అందుకుంటారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News April 15, 2025
గార : పోరుబందరు పోర్ట్‌లో మత్యకారుడు అదృశ్యం

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్‌లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్‌కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 15, 2025
కోటబొమ్మాళిలో వ్యక్తి ఆత్మహత్య

కోటబొమ్మాళి గ్రామంలోని విద్యుత్ నగర్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. మృతుడు బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుగా గుర్తించామన్నారు. SBI వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఉరివేసుకున్నాడని అందిన సమాచారంతో పరిశీలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతికి కారణాలు తెలయాల్సి ఉందని తెలిపారు.
News April 15, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని 2015, 2016, 2017,2018, 2019 ఎడ్మిట్ డిగ్రీ విద్యార్థులకు 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్‌ను నేడు యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు మే 17వ తేదీ లోపు చెల్లించవచ్చని తెలిపారు.