News January 13, 2026

బెంగాల్‌లో నిఫా కలకలం.. కేంద్రం అప్రమత్తం

image

WBలో ఇద్దరికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జనవరి 11న AIIMS కళ్యాణిలోని ICMR ల్యాబ్‌లో ఈ కేసులు గుర్తించారు. పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి ప్రత్యేక వైద్య బృందాన్ని రంగంలోకి దింపింది. నిఫా అధిక డెత్ రేటు కలిగిన ప్రమాదకర వైరస్ కావడంతో చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Similar News

News February 20, 2026

నత్తల నివారణకు విషపు ఎరను ఎలా తయారు చేయాలి?

image

ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, థయోడికార్బ్ 100 గ్రాములు, ఆముదం నూనె 100ML కలిపి చిన్న ఉండలుగా చేసి పొలాల్లో అక్కడక్కడా వేయాలి. వీటిని తిన్న నత్తలు మరణిస్తాయి. అంతేకాకుండా 1.5 లీటర్ల నీటిలో పొగాకు కాడెలను (50 గ్రా.) ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసి నత్తలను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News February 20, 2026

ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

image

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.

News February 20, 2026

16 శుక్రవారాల కథ..

image

ఇతర దేశానికి వెళ్లిన తన భర్త క్షేమం కోసం, అత్తామామల వేధింపులు భరిస్తున్న ఓ పేద ఇల్లాలు ఈ వ్రతాన్ని ఆచరించింది. భార్య భక్తికి మెచ్చిన మాత తన భర్తకు కలలో కనిపిస్తుంది. తన భార్య పడుతున్న కష్టాలను వివరిస్తుంది. దీంతో వెంటనే అతను అపారమైన సంపదతో ఇంటికి తిరిగి వస్తాడు. దంపతులిద్దరూ కలిసి అమ్మవారికి కృతజ్ఞతగా ఉద్యాపన చేస్తారు. ఈ కథ కష్టాల్లో దైవం ఎలా ఆదుకుంటుందో చెబుతుంది. ఈ కథ విన్నా వ్రతఫలం దక్కుతుందట.