News January 17, 2026
బెంగాల్‌లో మార్పు కావాలి.. బీజేపీ రావాలి: మోదీ

TMC అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలనే విషయం బయటపడిందని PM మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని, కేంద్ర సాయం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం BJP ప్రభుత్వం రావాలన్నారు. బిహార్‌లో NDA గెలుపు తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మాల్డా సభలో అన్నారు. ‘మార్పు కావాలి.. బీజేపీ రావాలి’ అని PM కొత్త నినాదమిచ్చారు.
Similar News
News February 10, 2026
ఢిల్లీ చేరిన సీఎం.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం 1 జన్‌పథ్‌లోని తన నివాసానికి వెళ్లారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.


