News January 26, 2025
బెజ్జూర్: పురుగుమందు తాగి మృతి

బెజ్జూర్ మండలం కుంటలమానపల్లికి చెందిన బోర్కుట్ ఎమ్మాజీ (48) శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఎమ్మాజీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు భార్య రుక్మాబాయి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం
News September 15, 2025
సంగారెడ్డి: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 23లోపు https://www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.
News September 15, 2025
GWL: బాధితుల సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్ డే: SP

బాధితుల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. వీటిలో భూ వివాదాలపై 3, గొడవలకు సంబంధించి 2, ఇంటి నిర్మాణం అడ్డగింత, భర్త వేధింపులు, ఆస్తి వివాదాలపై ఒక్కొక్కటి, ఇతర సమస్యలపై 2 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.