News March 23, 2025
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు: తిరుపతి SP

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాతనేరస్థుల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 8, 2026
ఇమ్యునిటీని పెంచే బ్రేక్ ఫాస్ట్

అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి గుడ్లు, చిలగడదుంప, ఓట్స్ అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్, ఫైబర్, బీటా-గ్లూకాన్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ ఈ, చిలగడ దుంపలో కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి.
News January 8, 2026
బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
News January 8, 2026
భద్రాద్రి: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

టెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో సెషన్ 1కు మొత్తం 100 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 87 మంది హాజరై 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అదే విధంగా సెషన్2కు 100 మంది అభ్యర్థులు కేటాయించబడగా, 56 మంది హాజరై 44 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు.


