News March 25, 2025
బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

IPL బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో CP పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో CP సమీక్ష జరిపారు.
Similar News
News March 26, 2025
ఖమ్మం: రూ.250 కోట్లతో మరో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ

ఖమ్మంలో తొలి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ.250 కోట్లతో, 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండటం గమనార్హం.
News March 26, 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..
News March 26, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.