News March 18, 2025

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

image

యువత, విద్యార్థులు బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్‌ ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, దానిని మంచికి వినియోగించాలన్నారు.

Similar News

News July 6, 2025

తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

image

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News July 6, 2025

తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

image

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

News July 6, 2025

పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

image

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.