News April 8, 2025

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా క్రికెట్‌, ఇతరత్ర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో యువత బెట్టింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రకటన చేశారు.

Similar News

News April 17, 2025

వేసవి సెలవులొస్తే ఇలా ఉండేది!

image

వారం రోజుల్లో వేసవి సెలవులొస్తున్నాయ్. ఇప్పుడంటే సెలవు రోజుల్లో టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. ఎండను చూసి భయపడుతున్నారు. కానీ, 90S కిడ్స్‌ అలా ఉండేవాళ్లు కాదు. మండుటెండలోనూ రస్నా తాగేసి సూర్యుడికి ఎదురుగా నిలబడేవాళ్లు. పాత టైర్‌తో ఊరంతా చుట్టేయడం, గోలీల ఆట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా, కర్రబిళ్ల వంటి ఆటలు ఆడుతూ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్లు. మీరూ ఇలానే చేసేవారా?

News April 17, 2025

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టేకులపల్లి వాసి

image

టేకులపల్లి మండలం సంపత్‌న‌గ‌ర్‌కు చెందిన కుడితేటి ర‌మేశ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో ర‌మేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంట‌లో 1,046 వీడియోలు అప్‌లోడ్ చేసింది. ఈ బృందంలో ర‌మేశ్ స‌భ్యుడు. సోమ‌వారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడ‌ల్ అందుకున్నారు.

News April 17, 2025

మంగళగిరి: ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు  

image

AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. మార్చి చివరి వరకు 4.39లక్షల ఓపీ రోగులు, 42,843 ఇన్‌పేషెంట్లకు సేవలు అందించారు. 

error: Content is protected !!