News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News April 9, 2025

ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

News April 9, 2025

TG మెడికల్ సర్వీసెస్ జనరల్ మేనేజర్‌గా ADB బిడ్డ

image

బోథ్‌కు చెందిన డా.రుక్మారెడ్డి TG మెడికల్ సర్వీసెస్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఔషధాలు, శస్త్ర చికిత్స పరికరాలు విభాగానికి జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని సబ్‌సెంటర్‌ల నుంచి మెడికల్ కాలేజీ దవాఖానాల వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ దవాఖానాల ఔషధ అవసరాలు పర్యవేక్షణ చేయనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం HYD DMHO ఆఫీస్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.

News April 9, 2025

ఇచ్చోడ: ఇంట్లో ఉరేసుకొని బాలిక మృతి

image

ఇచ్చోడ మండలంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన జరిగింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం. ముఖరా(బి)కి చెందిన రఫీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులతో మద్యం తాగి వచ్చి రోజు గొడవ పడేవాడు. దీంతో మనస్థాపానికి గురైన కూతురు షేక్ ఫిర్దోసి(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి జాబీనాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!