News April 6, 2025

బెల్లంపల్లిలో 9మంది జూదరులు అరెస్టు

image

పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్‌లో వెంకటేశ్‌కు చెందిన ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వెంకటేశ్, క్రాంతి కుమార్, రమేశ్, సురేశ్, మహేశ్, సుమన్, స్వామి, శ్రీనివాస్, మల్లాద్రిను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.12,500, 7ఫోన్లు, 5బైక్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.

Similar News

News April 7, 2025

వరంగల్: ప్రతిభ కనబరిచిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు

image

ఏవీవీ కళాశాలలో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెంప్ట్‌లో వరంగల్ నగరానికి చెందిన మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ కోచ్ మణికంఠ గడదాసుతో పాటు పలువురు అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ విచ్చేసి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.

News April 7, 2025

సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.

News April 7, 2025

మాచారెడ్డి: మద్యానికి బానిసై వ్యక్తి మృతి

image

మాచారెడ్డి మండలం చంద్రనాయక్ తండాకు చెందిన బింగి ధర్మపురికి జమునతో వివాహం చేసుకున్నాడు. పిల్లలు లేకపోవడంతో ఆమె ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ధర్మపురి మద్యం అలవాటుతో ఇంటికే పరిమితమయ్యాడు. శనివారం కాలకృత్యాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ధర్మపురి తిరిగి రాలేదు. అదే రాత్రి వాటర్ ట్యాంక్ మెట్లకు ఉరేసుకొని మృతి చెందినట్టు ఎస్ఐ అనిల్ తెలిపారు.

error: Content is protected !!