News October 13, 2025
బెల్లంపల్లి: కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడండి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని మాజీ సర్పంచి అనిత కోరారు. ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్ వినతిపత్రం అందజేశారు. రాత్రికి రాత్రి చదును చేయించి ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు, కరెంటు మీటర్లు ఇచ్చి రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News October 13, 2025
కామారెడ్డి: మద్దతు ధర పోస్టర్ల ఆవిష్కరణ

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మద్దతు ధర పోస్టర్లను సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ విడుదల చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
News October 13, 2025
గద్వాల జిల్లాను పార్లమెంట్‌గా ఏర్పాటు చేయాలి

జోగులాంబ గద్వాల జిల్లాను పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని అఖిల పక్ష నాయకులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీకే బంగ్లాలో వారు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పార్లమెంటు సభ్యురాలుగా డీలిమిటేషన్‌లో భాగస్వామ్యం తీసుకొని కృషి చేయాలన్నారు.
News October 13, 2025
ఏయూలో ఆకస్మిక తనిఖీ చేసీన వీసీ

ఏయూలో పలు విభాగాలను వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్సరీని సందర్శించారు.ప్రతీ విద్యార్థికి అవసరమైన వైద్యసేవలను సత్వరం, సకాలంలో అందించాలని సూచించారు.