News September 12, 2025
బెల్లంపల్లి: కేంద్ర పర్యావరణ శాఖ అధికారి పర్యటన

మొక్కలు నాటి పరిరక్షించడంలో సింగరేణి ఇతర రంగాలకు ఆదర్శంగా నిలుస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సైంటిస్ట్ అడ్వైజర్ తరుణ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి GM విజయభాస్కర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ GM కార్పొరేట్ సైదులుతో కలిసి ఏరియాలో పర్యటించారు. BPA-OCP-2 ఎక్స్టెన్షన్, మూతపడిన గోలేటి1, 1A గనులను పర్యావరణ అనుమతుల నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులను పరిశీలించారు.
Similar News
News September 12, 2025
ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.
News September 12, 2025
గోదావరిఖని నుంచి గోవా.. రయ్.. రయ్..!

గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈనెల 23వ తేదీ ఉ.10 గంటలకు రాజధాని ఏసీ బస్ మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం అనంతరం గోవా చేరుకుని తిరిగి 28వ తేదీన గోదావరిఖని చేరుకుంటుందని GDK RTC DM నాగభూషణం తెలిపారు. టికెట్ ధర రూ.8,000 ఉంటుందని, పూర్తి వివరాలతోపాటు టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 12, 2025
HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.