News April 3, 2025

బెల్లంపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: MLA

image

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండలంలోని తాళ్లగురజాల గ్రామంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీల క్రీడా కిట్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రామ్ చందర్, నాయకులు రామన్న, సురేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Similar News

News October 19, 2025

అనపర్తి: వివాహ వార్షికోత్సవం రోజే మహిళ ఆత్మహత్య..?

image

అనపర్తికి చెందిన శిరీష (30) వివాహ వార్షికోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. భర్త సంతోశ్ ఆఫీసుకు వెళ్తూ జండూబామ్‌ కనపడకపోవడంతో భార్యను మందలించాడని, మనస్తాపం చెందిన శిరీష బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుందని వారు పేర్కొన్నారు. అయితే భర్త, అత్త, ఆడపడుచు వేధింపుల వల్లే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News October 19, 2025

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

దీపావళి పండుగను పల్నాడు జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్  కృతికా శుక్లా పిలుపు నిచ్చారు. చిన్న పిల్లల, పెద్దలు బాణాసంచా కాల్చే విషయంలో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ కాలుష్య రహిత, ప్రజాహిత, ప్రజలకు ఇబ్బందిలేని పండగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు

News October 19, 2025

ఉప ముఖ్యమంత్రి, మంత్రికి PDPL MP లేఖలు

image

SC, ST విద్యార్థుల విద్యాపరమైన సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని DY.CM భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌కు ఎంపీ వంశీకృష్ణ లేఖలు రాశారు. ప్రైవేట్‌ పాఠశాలలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు విద్యలో అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. బీఎస్‌ఎస్‌ఎస్‌ పథకం పాఠశాలలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. భవిష్యత్‌ నిధుల విడుదలకు పారదర్శకమైన, సమయబద్ధమైన విధానం రూపొందించాలని MP విజ్ఞప్తి చేశారు.