News March 10, 2025
బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News March 10, 2025
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్

దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2025
ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్: TGPSC

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. తాజాగా గ్రూప్-1 ఫలితాలు వెల్లడించింది. రేపు గ్రూప్-2, ఈనెల 14న గ్రూప్-3, ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.
News March 10, 2025
ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!