News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News April 5, 2026

ADB: సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

ADB: 7న డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

image

ఆదిలాబాద్‌ శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 7న (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత తెలిపారు. టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.