News April 3, 2025
బెల్లంపల్లి: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి J.ముఖేష్ తీర్పునిచ్చారు. పట్టణంలోని బెల్లంపల్లిబస్తికి చెందిన MD.అమ్రాన్ అనే నిందితుడి పై S.సతీష్ రూ.10లక్షలు, K.రమేశ్ రూ.4లక్షలు చెక్ బౌన్స్ కేస్ నమోదైంది. కేసు విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో అమ్రాన్‌కు జరిమానాతో పాటు సంవత్సరం జైలు శిక్ష విధించారు.
Similar News
News April 3, 2025
WNP: కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్

WNP జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై BRS నేతల బురద జల్లే ప్రయత్నాలు, కంకణం కట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో PBR మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు.
News April 3, 2025
ఇంకెప్పుడు మంత్రివర్గ విస్తరణ?

TG: మంత్రివర్గ విస్తరణ ప్రహసనంగా మారిపోయింది. GOVT ఏర్పడి ఏడాదిన్నర దాటినా, ఎన్నోసార్లు CM ఢిల్లీకి వెళ్లొచ్చినా అడుగు ముందుకు పడట్లేదు. తాజాగా APR 3, 4వ తేదీల్లో ప్రమాణ స్వీకారమంటూ వచ్చిన వార్తలు గాల్లో కలిసిపోయాయి. 6 బెర్తుల కోసం ఆశావహులు కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడంతో పార్టీపరంగా నష్టమే ఎక్కువని, ప్రజల్లోనూ చులకనయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?
News April 3, 2025
SRHకు బిగ్ షాక్

IPLలో SRH తీరు మారడం లేదు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 4 రన్స్ కొట్టి హెడ్ ఔట్ కాగా తర్వాతి ఓవర్‌లో అభిషేక్ 2 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) కూడా క్యాచ్ ఔట్ అయ్యారు. దీంతో 201 రన్స్ భారీ టార్గెట్ ఛేదనలో SRH 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.