News November 8, 2025

బెల్లంపల్లి: చెక్ బౌన్స్.. జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా: సీఐ

image

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన నవీన్‌కు తీర్యాణి మండలం గంభీర్రావుపేటకు చెందిన శ్రావణ్ ఇచ్చిన రూ.10లక్షల చెక్ బౌన్స్ అయింది. నవీన్ కేసు వేశారు. నేరం రుజువు కావడంతో శ్రావణ్‌కు జడ్జి సంవత్సరం జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించారు.

Similar News

News April 14, 2026

యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్

image

అమెరికా-ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు సాగిన యుద్ధం వల్ల తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరతామని ప్రకటించింది.

News April 14, 2026

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

image

పుట్టపర్తిలోని ఆర్వీ జానకి రామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అధికారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

News April 14, 2026

మెదక్: రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ

image

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ ప్రారంభించారు.