News February 8, 2025
బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల

బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్‌పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
Similar News
News November 8, 2025
VJA: భవానీ దీక్షల విరమణపై సీపీ సమీక్ష

భవాని దీక్షల విరమణ బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు దేవస్థాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు యాప్ ఆధునీకరణపై చర్చించారు. దర్శన సమయాలు, పార్కింగ్, సేవల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
News November 8, 2025
శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించింది ఎర్ర చందనం: DCM పవన్

ఎర్ర చందనం చాలా అపురమమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాయం తగిలి, గాయం వల్ల చిందిన రక్తంతో ఎర్రచందనం పుట్టినట్లు శాస్త్రం చెబుతోందన్నారు. ఏపీలోని స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలిపివేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 8, 2025
కీరాతో ఎన్నో లాభాలు

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.


