News November 26, 2024
బెల్లంపల్లి: దేశ పౌరులుగా గర్వించాలి: GM

బెల్లంపల్లి ఏరియా గోలేటి GM కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. GM శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత విలువలు గల ప్రజా జీవన విధానం ప్రజాస్వామ్య దేశంగా మంచి పేరు రావడానికి కారణం మన రాజ్యాంగమే అన్నారు. ప్రతి వ్యక్తి దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశ పౌరులుగా గర్వపడాలన్నారు.
Similar News
News November 10, 2025
ఆదిలాబాద్: పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్‌కు వినతిపత్రం అందజేశారు. సోయా ఎకరాకు 6 నుంచి 7.60 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని కోరారు.
News November 10, 2025
ఆదిలాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి..!

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ADBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 9, 2025
పెరుగనున్న చలి తీవ్రత.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్ర చలి పరిస్థితులు నెలకొనున్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ADB కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. తెలంగాణ వేదర్‌మన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం జిల్లాలో 9–12 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు


