News February 1, 2025
బెల్లంపల్లి: బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లికి వచ్చిన పెద్దపులి

బెల్లంపల్లి పట్టణం స్టేషన్ ఏరియా పెద్దనపల్లి పెద్దమ్మతల్లి గుడి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖాధికారి పూర్ణచందర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఏరియాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లి ఏరియాలో సంచరిస్తుందన్నారు.
Similar News
News November 7, 2025
నిర్మల్: అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం జిల్లాలో అర్హులైన దివ్యాంగులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), ఇన్ఛార్జ్ డీడబ్ల్యూవో ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం కార్యాలయం పనివేళల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.
News November 7, 2025
జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.


