News March 14, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
Similar News
News April 12, 2026
11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
News April 12, 2026
ఘట్‌కేసర్: మార్ఫింగ్ ఫొటోలతో మహిళకు సైబర్ వేధింపులు

సోషల్ మీడియాలో మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివసించే మహిళ (38) స్నాప్‌చాట్‌లో భద్రపరచిన చిత్రాలను దుండగులు దుర్వినియోగం చేసి అసభ్యకరంగా మార్చి బంధువులకు పంపారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. బాధితురాలు 1930కు ఫిర్యాదు చేసి అనంతరం పోలీసులను ఆశ్రయించగా, నిందితుల కోసం సాంకేతిక దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 12, 2026
VZM: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. యువకుడి మృతి

ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందినట్లు సీఐ కె.నారాయణరావు చెప్పారు. ఆడారి వంశీ(28) పార్వతీపురం (M) కారాడవలస నుంచి బొబ్బిలి మండలం డొంగురువలస పెళ్లికి శుక్రవారం రాత్రి వచ్చాడు. ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వంశీ శనివారం మృతి చెందాడు. అతని తండ్రి తవిటన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.


