News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News February 17, 2026
రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
News February 17, 2026
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు.. అప్లై చేశారా?

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో( జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు 18-25ఏళ్ల మధ్య, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: incometaxgujarat.gov.in
News February 17, 2026
జహీరాబాద్ మున్సిపల్ పీఠం.. వీడిన ఉత్కంఠ

జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్ యూనుస్, వైస్ ఛైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ శిరీష రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, ఖేడ్, కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పటాన్‌చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.


