News February 11, 2026
బెల్లంపల్లి: వాట్సాప్ స్టేటస్‌లో బ్యాలెట్ పేపర్

బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి బస్తీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు సురేష్ 32వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశాడు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు. సదురు వ్యక్తిపై, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
పోలింగ్.. టాప్‌లో నల్గొండ కార్పొరేషన్

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కార్పొరేషన్ పరిధిలో రికార్డు స్థాయిలో 77.36 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లలో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ భద్రత మధ్య పోలింగ్ ముగియగా, ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.
News February 11, 2026
ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 13 నుంచి 15 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 3 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.


