News March 23, 2025

బెల్లంపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కృషి: MLA

image

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమానికి కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు.

Similar News

News January 10, 2026

ఇరాన్‌ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

image

ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా భారత బాస్మతి రైస్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. రియాల్‌ విలువ భారీగా పతనమవడంతో ఆహార దిగుమతులపై సబ్సిడీని టెహ్రాన్‌ ఎత్తివేసింది. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్‌ పోర్టుల్లోనే నిలిచిపోయింది. దీనితో పంజాబ్‌, హరియాణాలకు చెందిన రైస్‌మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోకు రూ.3-4 వరకు ధరలు పడిపోవడంతో రైతులకూ నష్టం వాటిల్లుతోంది.

News January 10, 2026

శ్రీశైలంలో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సాక్షి గణపతి నుంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 10, 2026

APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

image

<>భారత్ <<>>ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA/MBA, PGDM, MA, MSW, BE, BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం Asst.మేనేజర్‌కు రూ.50K-రూ.1.60L,మేనేజర్‌కు రూ.60K-రూ.1.80L, Dy.GMకు రూ.90K-రూ.2.40L, GMకు రూ.1L-రూ.2.60L,CGMకు రూ.1.20L-రూ.2.80L చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bemlindia.in