News August 28, 2025
బెల్లంపల్లి: హత్యాయత్నంలో నిందితుడి అరెస్ట్

బెల్లంపల్లిలోని దత్తాత్రేయ మెడికల్ ఎదుట ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరచిన రౌడీ షీటర్ అఖిల్ ను అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్ చెప్పారు. CI వివరాల ప్రకారం.. 26న అఖిల్ అనే వ్యక్తి సతీష్‌ను బండరాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. బుధవారం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడికి తరలించినట్లు చెప్పారు.
Similar News
News August 28, 2025
ఎన్టీఆర్ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, ఏ. కొండూరు, విసన్నపేట, గంపలగూడెం, రెడ్డిగూడెం, తిరువూరు, మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.
News August 28, 2025
మోమిన్పేటలో అత్యధికంగా 44.8 మిమీటర్ల వర్షపాతం

వికారాబాద్ జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాతం వివరాలను జిల్లా వాతావరణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అత్యధికంగా మోమిన్‌పేట మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, కోట్‌పల్లి మండలంలో ఎలాంటి వర్షం కురవలేదని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News August 28, 2025
శ్రీకాకుళం: సావిత్రమ్మ నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.