News September 13, 2025

బెల్లంపల్లి: 9వ తరగతి విద్యార్థిని సూసైడ్

image

బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎలుకల మందు సేవించిన ఆమెను కుటుంబీకులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 13, 2026

నిధులిచ్చాం.. తేడా వస్తే మీ తప్పే: చంద్రబాబు

image

AP: పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు అందించామని అయినా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు.

KMM: అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ: మంత్రి తుమ్మల

image

అంగన్‌వాడీలు బాధ్యతాయుతంగా పనిచేసి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలో టీఎన్జీవోస్ భవనంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా విధులను నిర్వహించాలని, ఫోన్లతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీల పనితీరు ఆధారంగానే ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.