News February 21, 2025

బెల్లంపల్లి: FEB 23న TG CET

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఈనెల 23 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు.

Similar News

News January 25, 2026

వనపర్తి: వారిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం

image

దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి సుధారాణి తెలిపారు. దివ్యాంగులు మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షలు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు (టీజీ ఈపాస్) వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News January 25, 2026

చిత్తూరులో ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాంట్

image

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ రీ సైకిల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శనివారం నగరిలో జరిగిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో చిత్తూరు నగరపాలక సంస్థ, జాగృతి టెక్ ప్రైవేటు లిమిటెడ్, వుయ్ కేర్ యూ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. రోజువారీగా ఉత్పత్తయ్యే సుమారు నాలుగు టన్నుల ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

News January 25, 2026

కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్య కుమార్

image

గ్రామీణ కిడ్నీ రోగుల సౌకర్యార్థం రాష్ట్రంలో రూ. 11.05 కోట్లతో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్య కుమార్ తెలిపారు. NTR జిల్లా నందిగామ CHC కేంద్రంలో రూ. 85 లక్షలు చేసే రక్తశుద్ధి యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. 2024-25లో కిడ్నీ బాధితుల కోసం కూటమి ప్రభుత్వం రూ.164 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివరించారు.