News March 18, 2025
బెల్లంపల్లి: KU డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి: శంకర్

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ శంకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్ MD.రఫీ తెలిపారు. కళాశాలలో BA, Bcom, Bscచదువుతున్న 2వ,4వ,6వ సెమిస్టర్ విద్యార్థులు ఈ మేరకు నిర్ణయించిన ఫీజులు ఆన్ లైన్‌లో చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు కాకతీయ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News February 20, 2026
ఏడాది చివరికల్లా 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు: సత్యకుమార్

AP: సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఈ ఏడాది చివరి కల్లా వినియోగంలోకి తెస్తామని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో తెలిపారు. ‘వీటి నిర్మాణానికి గత GOVT ₹12 కోట్లే ఇచ్చింది. మిగతా నిధులన్నింటినీ ఇచ్చి మా ప్రభుత్వమే పూర్తిచేయిస్తోంది. 300 మంది వైద్యుల్ని నియమించాం. ఇన్‌సర్వీస్, సీనియర్ రెసిడెంట్ల విభాగంలో 600మందిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు.
News February 20, 2026
పార్వతీపురం: ‘ఫీడర్ అంబులెన్స్ సర్వీసుల టెండర్ రెన్యువల్ చేయాలి’

గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న ఫీడర్ అంబులెన్స్ సర్వీసుల టెండర్ రెన్యువల్ చేయాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి.ఈశ్వరరావు, ఆర్. రాము డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.
News February 20, 2026
వాడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పర్చూరు వైపు వస్తున్న కారు- బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పర్చూరు SI పులి గోపి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు తెలియాల్సిఉంది.


