News October 7, 2025

బెస్ట్ అవైలబుల్ స్కూల్‌ విద్యార్థుల ఇబ్బంది.. కొప్పుల ఆగ్రహం

image

జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బయటకు పంపివేయడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ శాఖ మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విద్యార్థులను వెంటనే స్కూల్స్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News April 13, 2026

జగిత్యాల: చివరి రోజు 99.93% హాజరు

image

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. నేడు జరిగిన చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షకు 68 కేంద్రాల్లో 12,694 మందికి గాను 12,685 మంది హాజరై 99.93% హాజరు నమోదైంది. 9 మంది గైర్హాజరయ్యారు. సప్లమెంటరీలో 2 మందిలో 1 విద్యార్థి హాజరై 50% నమోదైంది. అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాము తెలిపారు.

News April 13, 2026

కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News April 13, 2026

‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి మేము వ్యతిరేకం: CM

image

TG: NDA ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ సౌత్ స్టేట్స్‌కు ఇవ్వడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి’ అనే విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేయొద్దన్నారు.