News April 11, 2025

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ అవార్డు 3వసారి మనకే..!

image

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్‌ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా విభాగంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్‌ ఫణికర్‌ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.

Similar News

News November 8, 2025

సంతోష సాగరం… ముంబై మహానగరం

image

ముంబై అనగానే మనకు గజిబిజి జీవితాలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆసియాలోనే ఇతర నగరాలకు మించి ఎన్నో ఆనందానుభూతుల్ని అందించే ప్రాంతాల్లో నం.1గా నిలిచింది. ‘Time Out’s City Life Index-2025’ సర్వేలో ఇది వెల్లడైంది. సంస్కృతి, జీవన నాణ్యత, స్థానికుల ఆదరణ, ఉపాధి వంటి అంశాలపై సర్వే చేపట్టి సంస్థ విశ్లేషించింది. ఆసియాలోని బీజింగ్, షాంఘై, చాంగ్ మాయి, హనోయ్‌లను ముంబై బీట్ చేసింది.

News November 8, 2025

విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.

News November 8, 2025

ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

image

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.