News February 4, 2026
బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు పొందిన అనంతపురం మహిళ

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హసీనా బేగం ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ బ్యూటీషియన్’ అవార్డును అందుకున్నారు. బెంగళూరులో కర్ణాటక బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వహించిన బ్యూటెక్ ఎక్స్‌పోలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో గౌరవప్రదమైన, అనుకూలమైన ఈ వృత్తిలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News February 10, 2026
మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు: వెంకటరామిరెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూను అందరూ మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి లడ్డూను సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
News February 10, 2026
చారిత్రక కట్టడాల క్యాలెండర్ ఆవిష్కరణ

అనంతపురం జిల్లా చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా 12 చారిత్రాత్మక కట్టడాలతో రూపొందించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వ శతాబ్దపు కోనేరు, క్లాక్ టవర్, గుత్తి కోట, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వంటి ముఖ్యమైన కట్టడాలను నేటి తరానికి పరిచయం చేసేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. జిల్లా వైభవాన్ని చాటిచెప్పే ఈ ప్రయత్నం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
News February 10, 2026
బాల్య వివాహ రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

అనంతపురాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘బాల్య వివాహ విముక్త భారత్’ ప్రచార రథాన్ని ప్రారంభించి, గోడపత్రికను ఆవిష్కరించారు. వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.


