News October 23, 2025
బేగంపేటలో హత్య.. మృతురాలు లీసాగా గుర్తింపు

HYD బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో అస్సాం రాష్ట్రానికి చెందిన <<18085139>>మహిళ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. కాగా మృతురాలి పేరు లీసాగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923
News October 24, 2025
కోరుట్లలో గంజాయి మొక్కలు.. ముగ్గురి రిమాండ్

కోరుట్ల హాజీపూర్‌లో తుమ్మ చెట్ల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలా శంకర్(27), కైలాస్ కుమార్(29), సన్నీ(26) అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ బాబు, SI చిరంజీవి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 90,000ల విలువగల 9 గంజాయి మొక్కలను, 2 మొబైల్ ఫోన్లను వీఆర్ఏ, అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపామని పేర్కొన్నారు.
News October 24, 2025
ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.