News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Similar News
News February 27, 2026
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

TG: ప్రముఖ క్షేత్రం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందర్‌రాజన్ మృతితో ఇవాళ, రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
News February 27, 2026
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.10వేలు, పచ్చి పల్లికాయకు రూ.5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ.11,151 ధర వస్తే.. నం.5 రకం మిర్చి రూ.20,200, దీపిక మిర్చి రూ.20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.
News February 27, 2026
NLG: ఇంటికే రానున్న భద్రాద్రి తలంబ్రాలు!

భద్రాచలంలో ఏప్రిల్ 27న జరగనున్న సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా అందించేందుకు టీజీ ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నల్గొండ రీజియన్ ఆర్ఎం కె. జానీ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. భక్తులు రూ. 151 చెల్లించి తలంబ్రాల ప్యాకెట్‌ను బుక్ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 31వ తేదీ వరకు ఈ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.


