News October 22, 2025
బేడ బుడగ జంగం సమస్యలపై మంత్రికి వినతి

బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణు, బుధవారం HYDలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. SC వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ల పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు, పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాగ్ పోస్టులుగా ఉంచాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వేణు తెలిపారు.
Similar News
News October 23, 2025
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 23, 2025
సైకిల్ ర్యాలీ పోస్టర్, రూట్ మ్యాప్ ఆవిష్కరించిన KNR సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న 20 కి.మీ సైకిల్ ర్యాలీ పోస్టర్, రూట్ మ్యాప్‌ను సీపీ గౌస్ ఆలం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. 25న ఉదయం ఈ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై, 20 కి.మీ ప్రయాణించి, తిరిగి అక్కడే ముగుస్తుందని తెలిపారు. ఈ సైక్లింగ్ ర్యాలీలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ పిలుపునిచ్చారు.
News October 23, 2025
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కనుకులగిద్ద యువకుడు

హుజురాబాద్ మండలం కనుకులగిద్దకి చెందిన మొగిలిచర్ల కిషోర్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రామానికి వన్నె తెచ్చిన కిషోర్‌ను కనుకులగిద్ద డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అకుంటిత దీక్షతో 5 ఉద్యోగాలు సాధించిన కిషోర్ గ్రామానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కిషోర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామ యువతకు సూచించారు.