News April 20, 2025

బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

image

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Similar News

News September 10, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.

News September 10, 2025

ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

image

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.

News September 10, 2025

ప్రకాశం: పోస్టల్ స్కాలర్‌షిప్ పొందాలని ఉందా?

image

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించాలి.