News January 30, 2026

బైక్ సైలెన్సర్లు మార్చితే సీజ్ చేస్తాం.. ఎస్పీ హెచ్చరిక

image

ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తే బైక్‌లను సీజ్ చేస్తామని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పెద్ద శబ్దాల వల్ల గర్భిణీలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని గురువారం కోరారు.

Similar News

News February 13, 2026

మేడ్చల్: 3 రంగుల జెండాను నిలబెట్టిన ముగ్గురు ‘లత’లు!

image

మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉద్దమర్రి వార్డులకు చెందిన రాజీగళ్ల లత, పెద్దిరెడ్డి లత, దోసకాయల లత కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకే పేరుతో బరిలోకి దిగిన ఈ ముగ్గురు హస్తం గుర్తు మీద విజయం సాధించారు. ఎంసీపల్లిలో కారు స్పీడ్‌కు ఈ ముగ్గురు బ్రేకులేయడం చర్చనీయాంశమైంది. ఒకే పేరుతో ముగ్గురు కౌన్సిలర్లు కొలువుదీరడం గ్రామంలోనే కాదు మున్సిపాలిటీ అంతటా ఆసక్తిగా మారింది.

News February 13, 2026

మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

image

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్‌లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.

News February 13, 2026

క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న

image

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు‌.