News June 6, 2024

బైరెడ్డిపల్లి: నలుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు

image

పాతపేటలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ మమత భర్త రవిచంద్రపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో పేల్చిన టపాకాయలు రవిచంద్ర ఇంటి వద్ద అతని కుమార్తె, సోదరుని కుమారుడిపై పడి గాయపడినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్నారులకు గాయాలయ్యేలా టపాకాయలు ఎందుకు కాల్చారని ప్రశ్నించడంపై దాడి చేశారని ఆరోపించారన్నారు.

Similar News

News December 29, 2024

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రివెన్స్ డే: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News December 29, 2024

తిరుపతి: పరీక్షలు వాయిదా

image

తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.

News December 29, 2024

కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

image

కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.