News April 2, 2024
బైరెడ్డిపల్లి: యువకుడిపై పోక్సో కేసు నమోదు

బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈశ్వర్ (33) అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరుతో గత నెల 19న అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణలో బాలికపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిసిందన్నారు.
Similar News
News October 1, 2025
CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.
News September 30, 2025
NCD ఏర్పాటుకు చర్యలు: చిత్తూరు కలెక్టక్

పీహెచ్సీల్లో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజన్) సెల్ ఏర్పాటు చేస్తామని, దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీం సహకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో ఎన్సీడీపై జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఢిల్లీ) బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ప్రజా ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
News September 30, 2025
సెలవుపై వెళ్లిన చిత్తూరు DRO

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్ కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవుపై ఉండటంతో ఇన్‌ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్‌లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్‌ఛార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.