News February 28, 2026

బైరెడ్డి ఎప్పటికీ నా శత్రువే: గౌరు వెంకటరెడ్డి

image

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు ఎప్పటికీ శత్రువేనని టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అతడు ఎన్నడూ మాట మీద నిలబడలేదని విమర్శించారు. తనపై గతంలో రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారని ఆరోపించారు. కేవలం సీఎం చంద్రబాబుపై గౌరవంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. ఎంపీ శబరి ఎమ్మెల్యేల సహకారంతో నియోజకవర్గ పర్యటనలు చేస్తే బాగుంటుందని సూచించారు.

Similar News

News March 1, 2026

BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఫలితాల్లో గౌతమ్ ప్రతిభ

image

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో జయకేతనం ఎగిరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 240వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చాడు.

News March 1, 2026

ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

image

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త‌, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2026

సంగారెడ్డి: జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్

image

సంగారెడ్డి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) ఈ నెల 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. పోలీసుల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.