News August 29, 2025

బై బై గణేశా..

image

చవితి ఉత్సావాల్లో విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వినాయక శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ వైభవంగ సాగుతోంది. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పుర వీధులు మార్మోగుతున్నాయి. డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లు హోరెత్తాయి.

Similar News

News August 29, 2025

MBNR: బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది: మాజీ మంత్రి

image

కామారెడ్డి డిక్లరేషన్‌తోనే కాంగ్రెస్ గెలిచిందని, ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి, MBNR మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లు ఒక్కరూ లేరని, కాంగ్రెస్‌కి బీసీలపై మనసంతా విషమే ఉందన్నారు. కేసీఆర్ ఒక ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చారని, అంత మంది ఎంపీలు ఉన్న మీరు ఎందుకు బీసీ బిల్‌ని పాస్ చేపించడం లేదని ప్రశ్నించారు.

News August 29, 2025

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: SP

image

కురిసిన కుండ పోత వర్షాలకు ముంపునకు గురైన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్‌లోని రైతు వేదికలో బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విపత్తు నిర్వహణ బృంద సభ్యులకు కలిసి అభినందించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.

News August 29, 2025

ADB: పంచాయతీ ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, నియమావళిని వివరించి పలు సూచనలు చేశారు. సమావేశంలో JC శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఉన్నారు.