News January 4, 2026

బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

image

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్‌, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.

Similar News

News February 2, 2026

కలెక్టర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి కొండపల్లి

image

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం నూతన భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ రాం సుందర్ రెడ్డిని కొండపల్లి ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లా అభివృద్ధికి రథసారథిగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కార దిశగా పనిచేస్తున్నారని కలెక్టర్‌ను కొనియాడారు.

News February 2, 2026

ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వైద్య బీమా: మంత్రి

image

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య బీమా కల్పించే పథకాన్ని సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎస్.కోటలో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 65 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో రోగికి ఏడాదికి సుమారు రూ.20 వేలు ఖర్చు చేయడమే కాకుండా నెలకు రూ.10 వేలు పింఛన్ కూడా ఇస్తున్నామని తెలిపారు.

News February 2, 2026

పలు కేసుల్లో నిందితుడిపై PD యాక్ట్: VZM SP

image

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మజ్జి కృష్ణవర్ధన్ (చెర్రీ)పై జిల్లా పోలీసు శాఖ PD యాక్ట్ ప్రయోగించింది. నిందితుడిని ముందస్తు నిర్బంధంలో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని SP దామోదర్ ఆదివారం తెలిపారు. గత ఐదేళ్లలో విజయనగరానికి చెందిన చెర్రీపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో 8, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.