News September 22, 2025

బొంరాస్ పేట్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బొంరాస్ పేట్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య (50) బైక్ పై కొడంగల్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 23, 2025

సరిపడా సత్రాలు లేక మేడారం జాతరలో ఇబ్బందే..!

image

కోటి మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి నేరుగా మంగళవారం పరిశీలించనున్నారు. కాగా, సారలమ్మ వచ్చే ఒకరోజు ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. అయితే, అక్కడ సరైన సత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిపడా సత్రాలు ఏర్పాటు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

News September 23, 2025

శ్రీశైలంలో అలరిస్తున్న కళారూపాలు

image

శ్రీశైల మహా క్షేత్రంలో కన్నుల పండువగా దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు భక్తులను ఎంతగానో అలరించాయి. దేవతామూర్తుల రూపాలు, విచిత్ర వేషధారణ, వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

News September 23, 2025

MBNR జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.