News December 31, 2024
బొకేలు వద్దు.. పుస్తకాలు, పెన్నులతో రండి: పత్తికొండ ఎమ్మెల్యే
న్యూ ఇయర్ వేళ పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బొకేలు, పూలదండలు, శాలువాలతో రావొద్దని సూచించారు. విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మొక్కలు తీసుకురావాలని సూచించారు. జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం తన అభిమానులకు ఇలాంటి పిలుపే ఇచ్చారు.
Similar News
News January 3, 2025
కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News January 3, 2025
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు షేక్ ఆఫ్రిది
ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనబోయే ఏపీ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు షేక్ అఫ్రీద్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు నీలిమ, కార్యదర్శి భానుప్రసాద్ తెలిపారు. షేక్ ఆఫ్రిది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచాడని పేర్కొన్నారు.
News January 3, 2025
ఉప వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సభ్యుడు సమావేశం
షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ పీ.రంజిత్ భాషా హాజరయ్యారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతిపత్రాలను రాజీవ్ రంజాన్ మిశ్రా స్వీకరించారు.