News December 27, 2025

బొకేలు వద్దు.. పేద విద్యార్థులకు ‘చేయూత’ ఇవ్వండి: కలెక్టర్‌

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపే వారు, ఆ ఖర్చును సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం వెచ్చించాలని జిల్లా కలెక్టర్ షామ్మోహన్ కోరారు. జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న 15వేల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, దోమతెరలు లేదా ఇతర వసతుల కల్పనకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆడంబరాలకు బదులు పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Similar News

News December 31, 2025

పట్టుకోరు.. పట్టించుకోరు అనుకుంటున్నారా..?

image

రెగ్యులర్‌గా హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయి. కానీ న్యూ ఇయర్ టైంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణంలోనూ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఊర్లో ఉన్నాం కదా ఎవరూ పట్టుకోరు, పట్టించుకోరు అనుకోవద్దు. ఆల్కహాల్ తాగి బయటకి వస్తే పట్టుకోవడం పక్కా అని ఖాకీలు అంటున్నారు. So Be Careful.
– హైదరాబాద్‌లో కాసేపటి క్రితమే టెస్టింగ్స్ మొదలయ్యాయి.

News December 31, 2025

Jan-1 సెలవు.. మీకు మెసేజ్ వచ్చిందా..?

image

చాలా MNC, ఇండియన్ మేజర్ ఐటీ కంపెనీల్లో క్రిస్మస్ నుంచి మొదలైన హాలిడేస్ రేపటితో ముగియనున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు రేపు సెలవు ఉంటుందని పేరెంట్స్‌కు మెసేజ్ పంపాయి. JAN-1 ఆప్షనల్ హాలిడే కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ విచక్షణతో సెలవుపై నిర్ణయం తీసుకోవచ్చు. మీకు హాలిడే మెసేజ్ వచ్చిందా..?

News December 31, 2025

KNR: నూతన సర్పంచ్‌లకు 2025 ఓ జ్ఞాపకం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, ఉపసర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి 2025 సంవత్సరం ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 2025 డిసెంబర్‌లో జరిగిన జీపీ ఎన్నికల్లో వారు అష్టకష్టాలు పడి పోటీచేసి గెలుపొందడం వారికి మరిచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపి వారు పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారని ఆశిద్దాం.