News June 27, 2024
బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి: మంత్రి సత్యకుమార్ యాదవ్

తనను కలిసేందుకు వస్తున్న వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక సూచన చేశారు. ‘నిత్యం చాలా మంది కలిసేందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే నా దగ్గరకు వచ్చే వారు పూల బొకేలకు బదులుగా నోటు బుక్స్, శాలువాలకు బదులుగా టవల్స్ వంటివి తీసుకొస్తే అవి పేదలు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. మనం చేసే పని పది మందికి మేలు చేయాలనేది నా ఉద్దేశం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 9, 2025
అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.
News November 8, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.