News February 22, 2026
బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ <<19145902>>మరణంపై<<>> మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలతోనే ఆయనను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘శ్రీనివాస్ GST పర్మిషన్‌ను మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్‌పల్లి వద్ద హత్య చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్‌లో తోసేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం’ అని పోలీసులు చెప్పారు.
Similar News
News February 28, 2026
పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.
News February 28, 2026
ESIC రాయ్‌పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 28, 2026
ఇది ‘యుద్ధ ప్రపంచం’

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐదారు యుద్ధాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అవకాశాన్ని బట్టి ఇటు గాజాలోని హమాస్ మిలిటెంట్లు, అటు లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు చేస్తోంది. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై అటాక్ చేశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ కూడా భీకర పోరాటాలు చేసుకుంటున్నాయి.


